ఈ చిత్రంలో హీరోలు, విలన్‌లు వుండరు- రాంగోపాల్‌వర్మ
ప్రత్యర్థి తల నేలకొరిగిందా ! లేదా ! అన్నదే లెక్క. ఈ లెక్కలో రెండు నాలుగవుతాయి, నాలుగు ఎనిమిదవుతాయి, ఎనిమిది…దీనికి అంతుండదు. ఆపామా మనం అంతమవుతాం. దీనిపేరే ఫ్యాక్షనిజం. ఈ ఫ్యాక్షనిజం గొడవల్లో రాటుదేలిన రెండు కుటుంబాల కథే ‘రక్తచరిత్ర’ దీన్ని వర్మ తనదైన తరహాలో రాసుకున్నాడు. ఆనందపురంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఓ యుద్ధం. ‘పగప్రతీకారాలే కాదు, వాటి సుడిగుండంలో పడకూడదనీ నా చిత్రం చెబుతుంది’ అని వర్మ వివరిస్తున్నాడు. తెలుగులో సి.కళ్యాణ్ సమర్పిస్తున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ…’రొటీన్ తరహాలో వస్తున్న సినిమా కాదు. సరికొత్త యాక్షన్ మూవీ. ఈనెల 22న విడుదల కానున్నది’ అని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ
రక్తచరిత్ర మూడు భాషల్లోనూ రెండు భాగాలు వుంటాయా?
వుండవు. హిందీలో ఒకే భాగముంటుంది. తెలుగులో రెండు భాగాలుంటాయి. తమిళంలో ఒకటే వుంటుంది.
ఈ కథను ఎలా కొనసాగిస్తారు?
పరిటాల రవి కథ తెలిసినవారికి రెండోది చూస్తే అర్థమవుతుంది. దాన్ని కంటెన్యూ ఎక్కడా మిస్ అవ్వదు.
సెన్సార్‌లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
అన్నీ అనుకున్నట్లు చూపాలని దర్శకుడిగా నాకుంటుంది. కానీ వారి యాంగిల్ వేరుగా వుంది. నా కన్నా ఎక్కువ సెన్సార్‌వారికి తెలుసని అనుకోవడంలేదు. ఒక ‘లా’ వుంది. దాన్ని ఫాలో అవ్వాలి. ‘అనంతపురం’ ఊరనేది అందరికీ తెలుసు. దాన్ని ‘ఆనందపురం’ అని మార్చారు. అంటే.. ప్రజలందరికీ ఆ ఊరు తెలిసినా, సెన్సార్‌వారికి తెలియకపోవడం విశేషం.
మహాభారతం, గాంధీగారి కొటేషన్లు వున్నాయి. వాటిపై విమర్శలు వస్తున్నాయి?
విమర్శలు ఎక్కడైనావస్తాయి. గాంధీ కుటుంబాన్ని చంపేస్తే అప్పటి పరిస్థితిలో ఆయన కొటేషన్ వేరేగా వుండేది. భారతంలో వున్నది ప్రతీకారమే. నా యాంగిల్‌లో నేను ఆలోచించి ‘ప్రతీకారమే పరమ సోపానం’ మహాభారతం అని రాశాను. దాన్ని అందరూ అంగీకరించాలనే రూలులేదు.
ఈ చిత్రం ద్వారా ఏం చెప్పబోతున్నారు?
ఇది లవ్‌స్టోరీకాదు. సింగపూర్‌లో పాటలు, బ్రహ్మానందంతో కామెడీ ఉండదు. పెద్ద సెట్లు లేవు. ఒక ఊరిలో ఇరువర్గాల మధ్య జరిగిన కథను తెలుసుకుని దాన్ని నా ఆలోచనల్తో మార్చాను.
ఇరు వర్గాల్లో ఏ వర్గాన్ని మంచివర్గంగా చూపారు?
సినిమా చూశాక మీరే చెప్పండి. నేను ఫలానా వర్గం మంచిది, చెడ్దది అని చెప్పలేదు. ఒకరికి మంచి అనేది మరొకరికి చెడుగా వుంటుంది. అనంతపురంలో ఒక వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని చంపాడు. చంపినతన్ని ఎందుకు చంపావు? అని అడిగితే.. ఆయన ఒక రీజన్ చెప్పాడు. అది కరెక్టే అనిపించింది. అంటే అది ఆయన యాంగిల్. చంపే ముందు అతనిమానసిక స్థితి, చంపిన తర్వాత మానసిక స్థితి ఎలా వుందో కూడా చెప్పాడు. గాంధీగారిని చంపిన వ్యక్తి దానికి రీజన్ చెప్పాడు. ఆయన దృష్టిలో అది కరెక్టే. అలా అని నేను సపోర్ట్‌చేయడంలేదు. ఇరు వర్గాలవారి నుంచి బెదిరింపులు వచ్చాయి? చంపుతామంటున్నారు? ఏ వర్గం మీకు అండగా వుంటుంది?
నాకంటూ ఓ వర్గం వుంది. అది నన్ను కాపాడుతుంది. మాఫియా చిత్రాలుతీసినప్పుడు ఇటువంటివి ఫేస్‌చేశాను. ఇది ఒక సినిమాలా చూడాలి అంతే.
అసలు మీ సినిమా ఎందుకు చూడాలి?
కరెక్ట్‌ప్రశ్న.. ప్రతి వాడు సినిమాను ఎందుకు చూస్తాడు. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, లవ్ ఇలా ఏదో ఒకటి ఆశించి వస్తాడు. నా సినిమాలో యాక్షన్ వుంది. వయొలెన్స్ వుంది. అది నచ్చినవారే చూస్తారు.
మిగతా సినిమాలువేరు? మీ సినిమాలు వేరు? ఇంత వయొలన్స్ చూడడం అవసరమా?
ఆ అవసరం వున్నవారే చూస్తారు.
దీని వల్ల మర్చిపోయిన గాయాల్ని మళ్లీ రేపినట్లవుతుంది గదా?
ఎవరు మర్చిపోయారు? ఎవరు రేపారు? ఇవన్నీ మీడియా సృష్టే… నా దృష్టిలో మీడియానే పెద్ద ఫ్యాక్షనిస్టు. ప్రతి విషయాన్ని భూతద్దంలోచూస్తారు.
రక్తమున్న కత్తిని కడుగుతున్న పోస్టర్ వేశారు? దాని అర్థమేమిటి?
మీరనుకున్నట్లు కత్తితో చంపేసి దాన్నిమాఫీ చేయడం మాత్రం కాదు. ఎంత రక్తదాహమున్నా చివరికి శాంతిగా వుండాల్సిందే.. ప్రేక్షకులు ఒక మైండ్‌సెట్‌తో రావాలి. అప్పుడే దాని అర్థం తెలుస్తుంది.
అంటే… మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రేక్షకులు మారాలంటారా?
కాస్త తడబడుతూ…. ఈ విషయాలు ఇక్కడవద్దు. మనిద్దరమే చర్చించుకుందాం… అంటూ దాటవేశారు.
ఇందులోఎవరిని హీరోలుగాచూపారు?
ఈ చిత్రంలో హీరోలు, విలన్‌లు వుండరు. సంఘటనలు, వ్యక్తులుంటారు. ప్రతీకారం అనేది ఆత్మ.
వివేక్ ఓబెరారు
వర్మతో నటించడం ఎలా వుంది?
రామూతో రెండవసారి. చాలా సంతోషంగా వుంది. నా పాత్రను, సినిమాను బాగా ఎంజారు చేశాను. కెరీర్‌లో 22 చిత్రాల్లో ఇదే ప్రత్యేకమైంది.
పరిటాల రవిని ఎరుగుదురా?
లేదు. ఆయన ఎవరో తెలీదు. అసలు రాజకీయాలంటేనే పడదు. నేను కళాకారుడ్ని. అందుకే విభిన్న పాత్రలు పోషించాలి. దానిలో భాగమే ఈ ప్రశాంత్ రవి పాత్ర పోషించాను.
తెలుగు సినిమాపై మీ అభిప్రాయం?
ఇక్కడ డెడికేషన్ ఎక్కువ. అనుకున్న టైమ్‌లో పని పూర్తవుతుంది.ప్రతి వ్యక్తి కష్టపడి పనిచేస్తారు. డిలే అనేది లేదు. తెలుగు సినిమాకుఅభిమానిని. మగధీర చూశాను. చాలా అద్భుతంగా వుంది.
No comments:
Post a Comment